బండి సంజయ్‌కి టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. టీటీడీలో అన్య మతస్తులు ఉన్నారని స్వయంగా కేంద్ర మంత్రే మాట్లాడడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి. పక్కనే టీటీడీ పాలకమండలి సభ్యుడిని పెట్టుకుని అలా మాట్లాడడం సరికాదని వెల్లడించారు.

బండి సంజయ్ చర్య తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయంపై దాడిలాగా భావిస్తున్నట్లు తెలిపారు భూమన కరుణాకర్ రెడ్డి. కాగా, తిరుమల దేవస్థానం పై కేంద్ర మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువుల ఆస్తి, హక్కు తిరుమల తిరుపతి దేవస్థానం అంటూ బాంబు పేల్చారు కేంద్ర మంత్రి బండి సంజయ్.టీటీడీలో అన్య మతస్తులకు ఉద్యోగాలు ఇవ్వడమేంటి? కొనసాగించడమేంటి? అని నిలదీశారు. ఇతర మతస్తులు ఉండడం వల్ల ఆచార వ్యవహారాలలో ఇబ్బందులు ఏర్పడుతాయి… ఈ పద్దతి మంచిది కాదు.. దీనికి ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాలని పేర్కొన్నారు.