భారతదేశంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. బ్లాక్ బ్యూటీ, మోడల్ రేచల్ సూసైడ్ చేసుకుంది. ఈ సంఘటన ఎప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. Puducherry ప్రాంతానికి చెందిన మోడల్ షాన్ రేచల్ గాంధీ అలియాస్ శంకరప్రియ… ఆత్మహత్య చేసుకుంది. 25 సంవత్సరాలు ఉన్న శంకర ప్రియ.. నిన్న అధిక మోతాదులో నిద్ర మాత్రలతో పాటు బీపీ టాబ్లెట్స్ మింగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఆరోగ్య అలాగే ఆర్థిక సమస్యలే కారణమని సమాచారం అందుతుంది.

ఆమె నల్లగా ఉండడంతో ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో మోడల్ గా శంకర ప్రియ మారిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మిస్ పుదుచ్చేరి, మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు, మిస్ బెస్ట్ యాటిట్యూడ్ బ్లాక్ బ్యూటీ విభాగంలో మిస్ వరల్డ్ టైటిల్ కూడా గెలుచుకుంది శంకర ప్రియ. అలాంటి శంకర ప్రియ తన పర్సనల్ కారణాలవల్ల తాజాగా ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.