మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఉన్నది మూడు అడుగులు.. ఆరు అడుగులు ఎగురుతున్నాడు… గ్లాసులో సోడా పోసిన అంత ఈజీ కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురావడం అని ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.

తిరుమలగిరి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… తులసి వనంలో గంజాయి మొక్క లాగా.. నల్గొండలో ఆడు ఒక్కడే ఏకలింగం లాగా గెలిచి ఏది పడితే అది కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. పేదలకు సన్న బియ్యం ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రేషన్ కార్డులు ఇవ్వాలన్నా, సన్న బియ్యం పెట్టాలన్న, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్న, రూ.500 బోనస్ అయినా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అని చెప్పారు.
ఆయన ఉన్నది మూడు అడుగులు.. ఆరు అడుగులు ఎగురుతున్నాడు
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
గ్లాసులో సోడా పోసిన అంత ఈజీ కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురావడం – రేవంత్ రెడ్డి pic.twitter.com/CEbRd5fu6X
— Telugu Scribe (@TeluguScribe) July 14, 2025