పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ బెల్టు షాపులు తెరిస్తే.. మేము రేషన్ షాపులు తెరిచామని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తిరుమలగిరి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…పేదలకు సన్న బియ్యం ఇస్తుంటే బీఆర్ఎస్ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారని ఫైర్ అయ్యారు. రేషన్ కార్డులు ఇవ్వాలన్నా, సన్న బియ్యం పెట్టాలన్న, పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలన్న, రూ.500 బోనస్ అయినా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం అని చెప్పారు.

రుణమాపీ కోసం రూ. 21 వేల కోట్లు రైతుల ఖాతాలో వేశామని.. 9 రోజుల్లో రూ. 9 వేల కోట్లు రైతు భరోసా ఇచ్చామన్నారు సీఎం రేవంత్. రైతు భరోసా ఇచ్చి రైతుల ఋణం తీర్చుకున్నాం…. 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్ గా నిలిచిందని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. నల్గొండ చరిత్ర నే తెలంగాణ చరిత్ర అంటే అతిశయోక్తి కాదు…నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్టు ,మూసీ ప్రాజెక్టు కట్టి నల్గొండ రైతులకు నీళ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు.