కేటీఆర్, కవితలకు మరో షాక్ తగిలింది. కేటీఆర్, కవితపై సీఐడీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. CID ఆడిషన్ డీజీ చారుసిన్హాను కలిశారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు. HCAలో అక్రమార్కుల వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని TCA ఆరోపణలు చేస్తోంది.

HCA ఎన్నికల్లోకి హఠాత్తుగా జగన్మోహన్ రావు రావడం వెనుక కేటీఆర్, కవిత హస్తం ఉందని అంటోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. HCA ప్రెసిడెంట్ గా జగన్మోహన్ రావు గెలవగానే.. నా విజయం కేటీఆర్, కవిత, హరీష్ రావుకి అంకితం అని చెప్పారని ఫిర్యాదులో పేర్కొన్న TCA… కేటీఆర్, కవితతో పాటు HCAలో ఉన్న మరికొందరు అక్రమార్కులపై కూడా దర్యాప్తు చేయాలని సీఐడీని కోరింది. ఇక తెలంగాణ క్రికెట్ అసోసియేషన్… ఫిర్యాదు నేపత్యం లో సీఐడీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.