బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు బిగ్ షాక్ తగిలింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కన్నడ నటి రన్యారావుకు జైలు శిక్ష… పడింది. రన్యారావుతో పాటు ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్ష పడింది.

శిక్షా కాలంలో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వని కోర్టు… రన్యారావుతో పాటు ముగ్గురు నిందితులకు ఏడాది జైలు శిక్ష వేసింది. గోల్డ్ డీలర్ గా వ్యవహరించిన సాహిల్ జైన్.. అక్రమంగా బంగారం రవాణా చేసేందుకు రన్యారావుకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. గతంలో రెండు సార్లు ఆమెకు సాయం చేసిన ఆధారాలను డీఆర్ఐ అధికారులు సేకరించారు. దుబాయ్ నుంచి అక్రమంగా 14 కేజీలకు పైగా బంగారం తరలిస్తుండగా.. ఎయిర్‌పోర్టులో రన్యారావును అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.