వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై దాడి !

-

మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడి చేసినట్లు చెబుతున్నారు. దీనిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం… ప్రతిపక్షాలు అధికార పార్టీ వైఫల్యాలపైన ప్రశ్నిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు. గల్ఫ్ కార్మికుల విషయంలో మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గల్ఫ్ సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, NRI సంక్షేమ బోర్డ్ ఏర్పాటు, గల్ఫ్ కార్మికుల టోల్ ఫ్రీ నెంబర్ లాంటి హామీలు ఇచ్చి ఇప్పటి వరకు అమలు చేయలేదు అని ప్రభుత్వాన్ని అడిగానన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.

vemula prasanth
vemula prasanth

గల్ఫ్ లో చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇస్తామని చెప్పి కొందరికి ఇచ్చారు ఇంకా నియోజకవర్గంలో రానివారు ఉన్నారు వారికి ఇవ్వాలని ప్రభుత్వంను అడగటం జరిగింది… ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ప్రజల పక్షాన అడగటం నా బాధ్యత.. ఇందులో తప్పేముందని నిలదీశారు. దీనికి బాల్కొండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మానాల మొహన్ రెడ్డి మా ఇంటి మీదికి వస్తా అని సవాల్ విసిరాడని ఆగ్రహించాడు. ఇవాళ మా ఇంటి మీదకి కొందరు కాంగ్రెస్ నాయకులు వచ్చి దాడి చేశారు… మానాల మొహన్ రెడ్డి గారి కడుపు సల్లబడిందా ? అని నిలదీశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news