ఆగస్టు 20లోగా స్కూళ్లకు కొత్త టీచర్లు వస్తారని పేర్కొన్నారు CM చంద్రబాబు. ఐదు సంవత్సరాలలో ఒక్క టీచర్ ను నియమించకుండా… స్కూల్లో టీచర్లు లేకుండానే బాగా చదువు చెప్పారని వైసీపీ గొప్పలు చెప్పుకుందని ఫైర్ అయ్యారు. ఇక నేను పిల్లల్ని బాగా చదివిస్తానని మాట ఇచ్చి మరి ఇప్పుడు మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టినట్లు గుర్తు చేశారు చంద్రబాబు నాయుడు.

చెప్పినట్లుగానే మొదటి సంతకం మెగా డీఎస్సీ పైన పెట్టానని వెల్లడించారు. ఆగస్టు 20వ తేదీ లోపు 16 వేల మంది టీచర్లను స్కూల్లకు పంపే బాధ్యత నాది వ్యాఖ్యానించారు చంద్రబాబు నాయుడు.
బెదిరిస్తే పారిపోయే వ్యక్తిని కానని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు. జలశక్తి మంత్రిత్వ శాఖ సమావేశంలో నీటి సమస్యలపై కీలక చర్చలు జరిగాయి… నీళ్ల విషయంలో ఇచ్చిపుచ్చుకొనే ధోరణి అవలంబిస్తామన్నారు. ప్రధాని కూడా నదుల అనుసంధానం చేయాలని భావిస్తున్నారని తెలిపారు సీఎం చంద్రబాబు.