రాయుడు హత్యకు రూ.30 లక్షలు ఆఫర్… పవన్ కళ్యాణ్ పై సోదరి కీర్తి ఫైర్ !

-

మా అన్నను హత్య చేసి కోటా వినూత దంపతులు మాకు రూ.30 లక్షలు ఆఫర్ చేశారని ఆరోపణలు చేశారు. చిన్న చిన్న విషయాల మీద పవన్ కళ్యాణ్ స్పందిస్తారు.. దీని మీద ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు మృతుడు రాయుడు సోదరి కీర్తి. మాకు ప్రాణహాని ఉంది అంటూ శ్రీకాళహస్తి డీఎస్పీని కలిసారు డ్రైవర్ రాయుడు సోదరి కీర్తి.

Driver Rayudu Sister Keerthi Fires On Kota Vinutha And Chandrababu
Driver Rayudu Sister Keerthi Fires On Kota Vinutha And Chandrababu

ఈ సందర్బంగా మాకు రక్షణ కల్పించాలని కోరారు కీర్తి. పవన్ కల్యాణ్ త్వరగా స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని వెల్లడించారు. హత్య జరిగిన తర్వాత వినూత వాళ్ళు 30 లక్షలు ఆఫర్ చేశారు.. వాళ్ల తప్పు ఉంది కాబట్టే ఆఫర్ చేశారన్నారు మృతుడు రాయుడు సోదరి కీర్తి. మేము డబ్బులకు లొంగే వాళ్ళము కాదు, మాకు న్యాయం జరగాలని వెల్లడించారు. ఈ కేసులో చాలా మంది ఉన్నారు.. వాళ్ళను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు మృతుడు రాయుడు సోదరి కీర్తి.

Read more RELATED
Recommended to you

Latest news