BREAKING: YCPకి మరో షాక్… మిథున్ రెడ్డికి రిమాండ్ విధించారు. లిక్కర్ స్కామ్ కేసులో ఎంపీ మిథున్ రెడ్డికి కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసులో అతడిని ఏ4గా ఏసీబీ కోర్టు తేల్చింది. ఆగస్టు 1 వరకు ఆయన రిమాండ్‌లో ఉండనున్నారు. కాసేపట్లో రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు.

ఇక అటు మిథున్ రెడ్డి అరెస్ట్ పై మాజీ మంత్రి పెద్దిరెడ్డి షాకింగ్ ప్రకటన చేశారు. తప్పుడు కేసులు బనాయించి వేధిస్తున్నారన్నారు పెద్దిరెడ్డి. లిక్కర్ స్కామ్‌లో మిథున్ రెడ్డి ప్రమేయం ఉందని తప్పుడు కేసులు పెట్టారు… ప్రతిపక్ష పార్టీలను అదుపులోకి తీసుకోవాలని చంద్రబాబు వెర్రి ఆలోచనలు చేస్తున్నాడని పేర్కొన్నారు. ఈ చర్యలు చంద్రబాబు రాజకీయ జీవితం మీదే మాయని మచ్చగా ఏర్పడుతుందన్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.