జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం – కేటీఆర్

-

జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు కేటీఆర్. డీలిమిటేషన్ అనేది ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగడానికి చేస్తారని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధుల సంఖ్య పెరిగితే ప్రజలకు మేలు జరుగుతుంది, ఆ ప్రక్రియను మేము స్వాగతిస్తున్నామన్నారు కేటీఆర్. కానీ జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేయడం సరికాదని చెప్పారు.

ktr
ktr

కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు దక్షిణాది రాష్ట్రాలు ఫ్యామిలీ ప్లానింగ్ ప్రక్రియను కట్టుదిట్టంగా పాటించాయని వివరించారు. ఈ నేపథ్యంలో జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు కేటీఆర్. ఉద్యోగం చేయడానికి వెళ్ళిన వ్యక్తిని తప్పకుండా హిందీ నేర్చుకోవాలని బలవంతం పెట్టడం తప్పు అన్నారు కేటీఆర్.

హిందీ ఇంపోజిషన్ ను వ్యతిరేకించారు కేటీఆర్. హిందీ జాతీయ భాష కాదని పేర్కొన్నారు. ఇండియాలో అధికారిక భాషలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. హిందీ భాష కోసం బడ్జెట్ లో రూ.50 కోట్లు ఇచ్చినప్పుడు, తెలుగు, బెంగాలీ భాషల కోసం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని నిలదీశారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news