కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తో గులాబీ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు భేటీ అయ్యారు. ప్రస్తుతం గులాబీ పార్టీలో యాక్టివ్ గా ఉన్న మల్లారెడ్డి కుటుంబం… భారతీయ జనతా పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు ఇప్పుడు చర్చ జరుగుతుంది. మేకల మండి బిజెపి లీడర్ ఇంట్లో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ తో మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి లంచ్ మీటింగ్ అయ్యారు.

పాతబస్తీ బోనాలలో కూడా బండి సంజయ్ ఫోటోతో ప్రీతి రెడ్డి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం గులాబీ పార్టీలో ఉన్న ప్రీతి రెడ్డి.. బండి సంజయ్ కుమార్ తో లంచ్ మీటింగ్.. చర్చనీయాంశమైంది. అయితే దీనిపై మల్లారెడ్డి ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
కేంద్రమంత్రి బండి సంజయ్ తో ఎమ్మెల్యే మల్లారెడ్డి కోడలు భేటీ
మేకలమండి బీజేపీ లీడర్ ఇంట్లో కేంద్రమంత్రితో కలిసి ప్రీతిరెడ్డి లంచ్ మీటింగ్
పాతబస్తీ బోనాల్లోనూ బండి సంజయ్ ఫోటోతో ప్రీతిరెడ్డి ఫ్లెక్సీల ఏర్పాటు
బీఆర్ఎస్ లో ఉన్న ప్రీతిరెడ్డి …
బండిసంజయ్ ను కలవడంపై ఇరు పార్టీలో… pic.twitter.com/lfdhyL6Y5u
— BIG TV Breaking News (@bigtvtelugu) July 21, 2025