ఫుడ్ డెలివరీ సంస్ధలకు అడ్డంపడుతున్న ఖాకీలు!

-

కరోనా మహమ్మారి భారతదేశంలో కూడా చాపకింద నీరులా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసుకుంటున్నాయి కూడా. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాల్లో కూడా లాక్ డౌన్ ను ప్రకటిస్తూ కేంద్రం,రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయాలు తీసుకున్నాయి. అయితే ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో కొన్ని వ్యవస్థల విషయంలో నిబంధనలను కొంత సడలించారు. లాక్ డౌన్ వేళల్లో ప్రజలకు రెస్టారెంట్లు అందుబాటులో ఉండవని ప్రభుత్వాలు ప్రకటించగా,అయితే ఫుడ్ డెలివరీలపై ఎటువంటి ఆంక్షలు ఉండవని కూడా పేర్కొన్నాయి. అయితే పోలీసులు మాత్రం రోడ్లపై కనిపించిన ప్రతిఒక్కరినీ బాదుతుండడం తో ఫుడ్ డెలివరీ సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. కరోనా నేపథ్యంలో రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను కొనసాగిస్తుండడం తో రోడ్ల పై ఎవరైనా కనిపిస్తే పోలీసులు మాత్రం తమ లాఠీలకు పని చెప్పి వారి భరతం పడుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా రాష్ట్రంలో పలుచోట్ల మీడియా పరినిధులపై దాడులు జరిగాయి అంటూ ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే ఈ ఫుడ్ డెలివరీ విషయంలో కూడా ప్రభుత్వ ఆదేశాలు పట్టించుకోకుండా తమ రెస్టారెంట్లపై దాడులు చేసి కిచెన్లు మూయించేస్తున్నారని ఫుడ్ స్టార్టప్ ఇన్నర్ చెఫ్ సంస్థ ఆరోపిస్తోంది. ఈ అనుభవాలు ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, నోయిడా తదితర ప్రాంతాల్లో తమకు ఎదురయ్యాయని ఇన్నర్ చెఫ్ సీఈవో రాజేష్ సాహ్ని తెలిపారు. దీంతో భయపడిపోయిన వంటివాళ్ళు తమ తమ గ్రామాలకు పారిపోయారని ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news