సోన్ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయం చేసి హీరో అని పిలిపించుకున్నాడు. అయితే మరోసారి గొప్ప మనసు చాటుకున్నారు బాలీవుడ్ నటుడు సోనూసూద్. వృద్ధుల కోసం ఆశ్రమం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు సోనూసూద్.

ఈ ఆశ్రమంలో సుమారు 500 మంది వృద్ధులకు ఆశ్రయం, వైద్యం తదితర సదుపాయాలు కల్పించేలా ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కరోనా సమయంలో ఎంతో మందికి సాయపడి సోనూసూద్ రియల్ హీరో అనిపించుకున్న సంగతి తెలిసిందే.