ఓ హెడ్ కానిస్టేబుల్ ప్రశంసనీయ పై చేసాడు. హైదరాబాద్ నగరంలో తాజాగా కురిసిన భారీ వర్షాలకు మోకాళ్ల లోతులో నీరు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే బంజారాహిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నీటితో నిండిన బస్ స్టాప్‌లో ఒంటరిగా చిక్కుకుపోయి భయపడింది ఓ యువతి.

ఆ యువతిని గమనించిన CAR ప్రధాన కార్యాలయానికి చెందిన హెడ్ కానిస్టేబుల్ శ్రీధర్ వర్మ.. కాపాడాడు. ఏ మాత్రం సంకోచించకుండా, మోకాళ్ల లోతు నీటిలో వెళ్లి యువతిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి పోలీస్ వాహనంలో తరలించారు. ఆపై సురక్షితంగా యువతిని కుటుంబానికి అప్పగించాడు.
హెడ్ కానిస్టేబుల్ ప్రశంసనీయ చర్య
హైదరాబాద్ నగరంలో నిన్న కురిసిన భారీ వర్షాలకు మోకాళ్ల లోతులో నీరు
బంజారాహిల్స్‌లోని సుల్తాన్-ఉల్-ఉలూమ్ పబ్లిక్ స్కూల్ సమీపంలో నీటితో నిండిన బస్ స్టాప్‌లో ఒంటరిగా చిక్కుకుపోయి భయపడుతున్న యువతిని గమనించిన CAR ప్రధాన కార్యాలయానికి చెందిన హెడ్… pic.twitter.com/NQ6qEx2AUg
— BIG TV Breaking News (@bigtvtelugu) August 8, 2025