నెల్లూరులో దారుణ ఘటన.. స్విగ్గి బాయ్ పై దాడి చేసిన మురళీకృష్ణ హోటల్ సిబ్బంది

-

నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. ఓ స్విగ్గి బాయ్ పైన దారుణంగా దాడి చేశారు. ఈ సంఘటన రాఖి పౌర్ణమి సందర్భంగా జరిగినట్లు తెలుస్తోంది. నెల్లూరు పట్టణంలో మురళీకృష్ణ హోటల్ చాలా ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. అయితే ఆ హోటల్ సిబ్బంది ఏకమై ఓ స్విగ్గి బాయ్ పై దారుణంగా దాడి చేశారట.

Brutal incident in Nellore Muralikrishna Hotel staff attacked Swiggy boy
Brutal incident in Nellore Muralikrishna Hotel staff attacked Swiggy boy

స్విగ్గి ఆర్డర్ త్వరగా ఇవ్వమని… ఆ కుర్రాడితో మురళీకృష్ణ హోటల్స్ సిబ్బంది గొడవ పడింది. ఇచ్చింది తీసుకువెళ్లంటూ దురుసుగా సమాధానం ఇచ్చారట. దీంతో ఆ స్విగ్గి బాయ్ నాగరాజు… మురళీకృష్ణ హోటల్ సిబ్బందికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడట. ఇంకేముంది ఆ మురళీకృష్ణ హోటల్ సిబ్బంది ఏకమై నాగరాజుపై దాడి చేశారట. పిడి గుద్దులతో రెచ్చిపోయారట. మొత్తం ఐదు మంది దారుణంగా కొట్టారని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news