నేడు టాలీవుడ్ నిర్మాతలతో మంత్రి కందుల దుర్గేష్ మీటింగ్ ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలవనున్నారు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, కొందరు టాలీవుడ్ నిర్మాతలు. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.

గతంలో ఏపీ ప్రభుత్వ పెద్దలతో వాయిదా పడిన టాలీవుడ్ ప్రతినిధుల సమావేశం… ఇప్పుడు మరోసారి జరుగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ మంత్రితో టాలీవుడ్ ప్రతినిధుల సమావేశం ఆసక్తి రేపుతోంది.