ఈ రోజు నుండి టాలీవుడ్లో షూటింగ్స్ బంద్ కానున్నాయి. ఈ మేరకు షూటింగ్స్ నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది ఫిలిం ఫెడరేషన్. ఇక ఫిలిం ఫెడరేషన్ వేతనాల పెంపుకు సహకరించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ కానున్నాయి.

శుక్రవారమే ఫెడరేషన్‌కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఆదేశాలు జారీ చేసింది ఫిలిం ఛాంబర్. దింతో నేటి నుండి అన్ని సినిమాల షూటింగ్స్ నిలిచిపోనున్నాయి. ఇక అటు నేడు టాలీవుడ్ నిర్మాతలతో మంత్రి కందుల దుర్గేష్ మీటింగ్ ఉంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలవనున్నారు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు, కొందరు టాలీవుడ్ నిర్మాతలు. సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది.