పూణేలో విషాదం.. 10 మంది మృతి.. మోడీ భారీ ఆర్థిక సాయం

-

పూణేలో విషాదం నెలకొంది. అదుపుతప్పి లోయలో వ్యాన్ పడింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా.. దాదాపు 27 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. శ్రావణ మాసం పవిత్ర సోమవారం సందర్భంగా ఖేడ్ తహసీల్‌లోని శ్రీ క్షేత్ర మహాదేవ్ కుందేశ్వర్ ఆలయానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Pune VIDEO 10 Women Dead Near Chakan As Tempo To Lord Shiva Temple Falls Into Pit
Pune VIDEO 10 Women Dead Near Chakan As Tempo To Lord Shiva Temple Falls Into Pit

ఈ ప్రమాద సమయంలో వాహనంలో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇక ఈ పూణే ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి సంతాపం ప్రకటించిన మోదీ… మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల పరిహారం, గాయపడినవారికి రూ.50 వేల పరిహారం ప్రకటన చేశారు. ఈ ప్రమాద ఘటనపై విచారం వ్యక్తం చేశారు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున పరిహారం అందించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news