సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అతి చిన్న వయసులోనే సినీ పరిశ్రమకు హీరోగా పరిచయమైన ఇతను తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాష సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు. రజనీకాంత్ వయసు మీద పడినప్పటికీ సినిమాలలో నటిస్తూ ఉన్నారు.

తాజాగా రజనీకాంత్ నటించిన చిత్రం “కూలీ”. ఈ సినిమా రేపు థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాను రూ. 350 – 400 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ నటించినందుకు రూ. 150 కోట్ల పారితోషికం తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. అంతేకాకుండా లోకేష్ కనగరాజ్ రూ. 50 కోట్లు, నాగార్జున రూ. 24 కోట్లు, అమీర్ ఖాన్ రూ. 20 కోట్లు, ఉపేంద్ర, శృతిహాసన్, సత్యరాజ్ రూ. 4 కోట్లు, అనిరుద్ రూ. 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పొందుతున్నట్లుగా సినీ సర్కిల్స్ లో ఓ వార్త వైరల్ గా మారింది.