రేపు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి – హైదరాబాద్ పోలీసులు

-

Cyberabad Police :  రేపు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి అని ఆదేశించారు సైబరాబాద్ పోలీసులు. రేపు భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఐటీ కంపెనీలకు సూచించారు సైబరాబాద్ పోలీసులు.

Cyberabad Police advise IT companies to allow employees to work from home in view of the possibility of heavy rain tomorrow
Cyberabad Police advise IT companies to allow employees to work from home in view of the possibility of heavy rain tomorrow

తెలంగాణలో గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో రెండు రోజులపాటు రెడ్ అలర్ట్ జారీ చేసినట్టుగా వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, మల్కాజ్గిరి, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, KMM, BPL జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, హనుమకొండ, కామారెడ్డి, అదిలాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల్, రంగారెడ్డి, వరంగల్, సిద్దిపేట్, నల్గొండ, ASF, JNG జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news