విజయవాడలో డ్రైనేజీ సిస్టం సరిగ్గా లేక నీళ్లు అన్నీ రోడ్ల మీదకి వచ్చాయి బాంబు పేల్చారు ఏపీ మంత్రి నారాయణ. విజయవాడ నగరంలో మంత్రి నారాయణ ఆకస్మిక పర్యటన చేశారు. భారీ వర్షంతో జలమయమైన ప్రాంతాలు పరిశీలించిన ఏపీ మంత్రి నారాయణ…. విద్యాధరపురం,బుడమేరు వంతెన,గాయత్రి నగర్ ప్రాంతాల్లో పరిస్థితి నీ పరిశీలించారు.

విజయవాడ నగరంలో డ్రెయిన్లు ఆక్రమణలకు గురికావడం తో చాలా ప్రాంతాల్లో రోడ్లు జలమయం అయ్యాయని పేర్కొన్నారు. ఆక్రమణలు తొలగించాలని ఇటీవలే కమిషనర్ కు ఆదేశాలిచ్చానన్నారు ఏపీ మంత్రి నారాయణ. VMC తీసుకున్న ముందస్తు చర్యలతో కొన్ని చోట్ల ఇబ్బందులు తప్పాయని చెప్పారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది అత్యవసర చర్యలు చేపట్టారన్నారు. బుడమేరు వరద వస్తుందని జరుగున్న ప్రచారంలో వాస్తవం లేదని పార్కోన్నారు ఏపీ మంత్రి నారాయణ. సీఎం చంద్రబాబు కూడా వర్షాలపై ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తున్నారన్నారు.