నంద్యాల జిల్లాలో వార్2 మూవీకి అంతరాయం ఏర్పడింది. నంద్యాల జిల్లా ఆత్మకూరులో హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్2 మూవీకి అంతరాయం ఏర్పడింది. సౌండ్ లేదంటూ.. ఘర్షణకు దిగారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఆత్మకూరులోని రంగమహాల్ థియేటర్లో వార్ 2 సినిమా నడుస్తుండగా మధ్యలో సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చింది.

దింతో యాజమాన్యంతో గొడవకు దిగారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఈ తరుణంలోనే 20 నిమిషాల పాటు మూవీ నిలిపివేశారు. కాగా వార్ 2 సినిమా ఫస్ట్ ఆఫ్ లో ఇంట్రడక్షన్ సీక్వెన్స్, అలాగే జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ డాన్స్ అదిరిపోయాయని అంటున్నారు. యాక్షన్ సీన్స్ అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్టులు అలాగే క్లైమాక్స్ అదిరిపోయాయి అని కూడా సోషల్ మీడియా పోస్టులు పెడుతున్నారు. Vf ఎక్స్ అలాగే బిజిఎం రెండు కాస్త మెరుగుపడి ఉంటే బాగుండేదని సూచనలు చేస్తున్నారు. కొన్ని యాక్షన్ సీన్స్ పెద్దగా పేలలేదని చెప్తున్నారు. మిగతా సినిమా మొత్తం బాగుందని అంటున్నారు.కాగా
నంద్యాల జిల్లా..ఆత్మకూరు
హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్2 మూవీకి అంతరాయం
సౌండ్ లేదంటూ.. ఘర్షణకు దిగిన జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు
ఆత్మకూరులోని రంగమహాల్ థియేటర్లో వార్ 2 సినిమా నడుస్తుండగా మధ్యలో సౌండ్ సిస్టమ్ ప్రాబ్లం
యాజమాన్యంతో గొడవకు దిగిన జూనియర్ ఎన్టీఆర్… pic.twitter.com/NVijnDCzny
— RTV (@RTVnewsnetwork) August 14, 2025