జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్… 12 మంది మృతి

-

జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ అయ్యారు. మచైల్ మాత యాత్రకు వెళ్ళే దారిలోని చసోటి గ్రామంలో క్లౌడ్ బరస్ట్ అయింది. ఈ ప్రమాదంలో దాదాపు 12 మంది మృతి చెందినట్లు సమాచారం. జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ లో 200 నుండి 300 మంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు అధికారులు.

Kishtwar cloudburst 12 feared dead after massive cloudburst in Jammu and Kashmir
Kishtwar cloudburst 12 feared dead after massive cloudburst in Jammu and Kashmir

ఇక ఈ ఘటన ప్రాంతానికి చేరుకున్న రెస్క్యూ బృందాలు…. జమ్మూకాశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్ లో 200 నుండి 300 మంది చిక్కుకున్న వాళ్ళ కోసం గాలిస్తున్నాయి. ఇక ఈ క్లౌడ్ బరస్ట్ ఘటనపై సీఎం ఒమర్ అబ్దుల్లా విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిస్థితులు, సహాయక చర్యలపైన ఆరా తీశారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో అధికారులు మచైల్ మాత యాత్రను కొన్ని రోజులపాటు నిలిపివేశారు. ఈ యాత్రకు ఎవరూ కూడా రావద్దని స్పష్టం చేశారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాతనే యాత్రను తిరిగి మళ్ళీ ప్రారంభిస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news