బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శ్రీదేవి కూతురుగా అందరికీ పరిచయమైన ఈ అందాల తార తెలుగులో మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించిన సంగతి తెలిసిందే. ఇక త్వరలోనే రామ్ చరణ్ సరసన కూడా మరో సినిమా చేయబోతోంది ఈ అందాల తార.

ఇలాంటి నేపథ్యంలో తరచూ తిరుమల శ్రీవారిని దర్శించుకునే జాన్వికపూర్.. ఇవాళ మరోసారి మెరిసింది. అంతకుముందు తన ప్రియుడితో వచ్చిన జాన్వికపూర్… తాజాగా నటుడు సిద్ధార్థ మల్హోత్రాతో తిరుమల శ్రీవారి సన్నిధిలో ప్రత్యక్షమైంది హీరోయిన్ జాన్వి కపూర్. ఈ సందర్భంగా అలిపిరి నుంచి కాళీ నడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఈ ఇద్దరు బాలీవుడ్ నటులు. దీనికి సంబంధించిన వీడియో అలాగే ఫోటోలు వైరల్ అవుతున్నాయి.