పులివెందుల జడ్పిటిసి స్థానంలో టిడిపి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి గెలవడంపై మంత్రి సవిత సంతోషం వ్యక్తం చేశారు. పులివెందులలో ప్రజాస్వామ్యం గెలిచింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ఒకరోజు ముందుగానే పులివెందులలో ప్రజలకు స్వేచ్ఛ దొరికింది. ఈ విజయానికి కష్టపడిన పార్టీ కార్యకర్తలు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని సవిత అన్నారు.

వచ్చే ఎన్నికలలో జగన్ ను ఓడించి పులివెందులలో కోట బద్దలు కొడతామంటూ సవిత సంచలన కామెంట్లు చేశారు. సవిత చేసిన ఈ కామెంట్లపై వైసిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో టిడిపి అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి గెలవడంపై ఫైర్ అవుతున్నారు. టిడిపి నేతలు డబ్బులు ఇచ్చి ఓటర్ స్లిప్పులను తీసుకున్నారని కొంతమంది అంటున్నారు. తీసుకున్న ఓటర్ స్లిప్పులతో దొంగ ఓట్లు వేశారని అంటున్నారు. దొంగ ఓట్లతో మారెడ్డి లతా రెడ్డి గెలిచిందని ఫైర్ అవుతున్నారు. దీనిపై టిడిపి నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.