నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది తెలుగు, హిందీలో వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటుంది. ప్రస్తుతం ఈ చిన్నది తెలుగులో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా… నటి మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ నటి బిపాషా బసుపై చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. బిపాషా బసు పురుషుడిలా కండలు తిరిగిన మహిళ అంటూ మృణాల్ గతంలో అన్న వీడియో ఒకటి ఇప్పుడు తాజాగా వైరల్ అయింది.

దీనిపై బిపాషా బసు పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. బలమైన మహిళలు మరొకరి ఉన్నతికి పాటుపడతారు. స్త్రీలు అందరూ చాలా దృఢంగా ఉండాలి. అప్పుడే స్త్రీలు ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటారని బిపాషా అన్నారు. మహిళలు బలంగా ఉండకూడదు అని పాతకాలం నాటి ఆలోచనలు, సాంప్రదాయాల నుంచి బయటకు రావాలి అంటూ బిపాషా పోస్ట్ చేశారు. దీంతో బిపాషా నటి మృనాల్ ఠాకూర్ కు కౌంటర్ గానే ఇలా మాట్లాడారని కొంతమంది సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. దీనిపై నటి మృణాల్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.