ప్రెగ్నెన్సీ సమయంలో ఈ కూరలు తినడం మంచికేదేనా?

-

ప్రెగ్నెన్సీ సమయంలో మంచి ఆహారం తీసుకోవడం తల్లి మరియు బిడ్డ ఆరోగ్యానికి ఎంతో ముఖ్యం. ఈ టైంలో పండ్లు, కూరగాయలు తీసుకోవడం వలన ఎన్నో రకాల విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. అయితే కొన్ని కూరగాయలు గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తాయి మరికొన్ని అధిక మోతాదు లో తీసుకున్న లేదా సరైన జాగ్రత్తలు లేకుండ తీసుకుంటే సమస్యలు కలిగిస్తాయి. మరి ప్రెగ్నెన్సీ సమయంలో ఏ కూరగాయలు తినడం మంచిది.. ఏవి అధిక మోతాదులోతీసుకోకూడదు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఆకుకూరలు: ప్రెగ్నెన్సీ టైంలో గర్భిణీ స్త్రీలకు అవసరమైన పోషకాలను అందించే కూరగాయలు సాధారణంగా మనం రోజు తీసుకునే ఆకుకూరలు, ఎలాంటి ఆకుకూరైనా అందులో విటమిన్ B9, ఐరన్, క్యాల్షియం,విటమిన్ A  లాంటి పోషకాలు ఉంటాయి.ఇది శిశువులోని న్యూరల్ ట్యూబ్ లోపాలను నివారిస్తుంది. అంతేకాక ఐరన్ వలన రక్తహీనత నివారిస్తుంది. అయితే బచ్చలాకు పూర్తిగా ఉడికిన తర్వాతే తీసుకోవాలి. ఏ ఆకుకూర ఐనా బాగా కడిగి ఉడికించి తీసుకోవడం మంచిది.

క్యారెట్: క్యారెట్ లో విటమిన్ ఏ ఫైబర్ ఆంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి బిడ్డ కళ్ళు చర్మం రోగనిరోధక శక్తిని అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్, లేదా సూప్ లో, ఉడికించి తీసుకోవచ్చు. ఇది మితంగా తీసుకోవడం మంచిది అధిక మోతాదులో తీసుకుంటే విటమిన్A వల్ల శిశువుకి హానికరం కావచ్చు.

Is It Safe to Eat These Vegetables During Pregnancy?
Is It Safe to Eat These Vegetables During Pregnancy?

బీట్ రూట్: బీట్ రూట్ లో ఫోలేట్,ఐరన్, నైట్రిట్ అధికంగా ఉంటాయి. ఇది రక్తపోటును అందించడంలో రక్తహీనత నివారించడంలో సహాయపడుతుంది. బీట్ రూట్ ను ఉడికించి తీసుకోవచ్చు లేదా సలాడ్ లో జ్యూసులుగా అయినా తీసుకోవచ్చు. బీట్రూట్ జ్యూస్ ను అధికంగా తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.

బంగాళదుంప: బంగాళదుంప లో విటమిన్ C, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి బిడ్డ అభివృద్ధికి సహాయపడుతుంది. బంగాళదుంపని ఉడికించి లేదా కూరలో చేర్చుకొని తినవచ్చు. రంగు మారిన బంగాళదుంపలను,ఆకుపచ్చని బంగాళదుంపలు నివారించాలి ఇది గర్భిణీ స్త్రీలకు హానికరం.

జాగర్తలు: కూరగాయలను బాగా కడిగి, ఉడికించి తినడం వల్ల బ్యాక్టీరియా పురుగుల మందుల ప్రభావం తగ్గుతుంది. ఏ ఒక్క కూరగాయను అధికంగా తీసుకోకూడదు వివిధ రకాల కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ టైంలో స్త్రీలు తమ ఆహారంలో కూరగాయలను చేర్చేముందు డాక్టర్ లేదా డైటీషియన్ సలహా తీసుకోవాలి. వీలైతే పురుగుల మందులు లేని ఆర్గానిక్ కూరగాయల్ని ఎంచుకోవడం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో స్త్రీలు తమ ఆహార ప్రణాళికను డాక్టర్ సలహాతో మాత్రమే తీసుకోవడం మంచిది. తమ ఆరోగ్యాలతో పాటు బిడ్డ ఆరోగ్యం కూడ ముఖ్యం.

(గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వటం జరిగింది.)

Read more RELATED
Recommended to you

Latest news