సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వస్తూ ఉంటాయి. ఇందులో జంతువులకు సంబంధించిన వీడియోలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ ఎద్దుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. బసవన్నకు కోపం.. రావడంతో డెబ్బై సంవత్సరాల ఓ ముసలాడిని.. ఎత్తిపడేసింది. పంజాబ్ రాష్ట్రంలోని బ్యాంకు కాలనీ అనే ప్రాంతంలో వృద్ధుడు… ఏదో పని పైన నడుచుకుంటూ వెళుతున్నాడు.

ఆ వృద్ధుడు… నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. అయితే అతని వద్దకు వచ్చి ఎద్దు రెచ్చిపోయింది. తన కొమ్ములతో ఎక్కిపడేసింది. ఈ నేపథ్యంలో గాల్లో మూడు సెకండ్ల పాటు ఆ వృద్ధుడు చెక్కర్లు కొట్టాడు. అనంతరం కింద పడిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.
బసవన్నకి కోపం.. 70 ఏళ్ల వృద్ధుని ఎత్తిపడేసిన ఎద్దు
పంజాబ్ ఫ్లజిల్కాలోని బ్యాంక్ కాలనీలో వృద్ధుడు నడుచుకుంటూ వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఎద్దు కొమ్మలతో పడేసింది pic.twitter.com/JSlmSluD6A
— greatandhra (@greatandhranews) August 14, 2025