శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కలకలం చోటుచేసుకుంది. కోట ఏరియాలో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి ఇంట్లో IB, NIA, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. పాకిస్థాన్ కు అతను ఫోన్ కాల్స్ చేస్తూ అక్కడ తీవ్రవాదులతో సంప్రదింపులు చేస్తున్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, నూర్ మహమ్మద్ టీ స్టాల్ లో పనిచేస్తున్నాడు. అతని ఇంట్లో అనుమానిత వస్తువులు, 16 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఉగ్రవాదులతో సంబంధాలపై NIA ఆరా తీస్తోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు విచారణ అనంతరం అసలు విషయం బయటకు రానుంది. నూర్ మహమ్మద్ కు నిజంగానే పాకిస్తాన్ తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయా లేదా అనే విషయం గురించి పోలీసులు విచారిస్తున్నారు. కాగా… గతంలో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులను ఏరిపారేస్తున్నారు పోలీసులు. ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో నూర్ మహమ్మద్ అనే వ్యక్తి దొరికాడు. నూర్ తో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్ర కలకలం..
నూర్ తో పాటు మరో యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పాకిస్తాన్ జెండాతో పాటు ఆ దేశానికి చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియో అప్ లోడ్ చేసిన రియాజ్
ఎర్రగుంట ప్రాంతానికి చెందిన యువకుడు రియాజ్
అన్ని కోణాల్లో… pic.twitter.com/Ts3SyuCcjy
— ChotaNews App (@ChotaNewsApp) August 16, 2025