శ్రావణమాసంలో స్త్రీలు వరలక్ష్మి వ్రతాలు ఎక్కువగా చేస్తారు. ఇప్పటికే చాలామంది మహిళలు వరలక్ష్మీ వ్రతాలను జరుపుకున్నారు. వరలక్ష్మీ వ్రతాల సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిఠాపురంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారి సొంత డబ్బులతో నియోజకవర్గంలోని దాదాపు పది వేల మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలను అందించనున్నారు.

పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో ఈనెల 22వ తేదీన వరలక్ష్మీ వ్రత కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. స్థానిక ఆచారం ప్రకారం ఎప్పటిలానే అక్కడ ఎమ్మెల్యే చీరలు అందించనున్నారు. ఇదిలా ఉండగా… ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు సినిమాలలో హీరోగా నటిస్తున్నారు. రాజకీయాలలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. ప్రజలకు ఎప్పుడు మంచి చేయాలనే ఉద్దేశంతో ముందడుగు వేస్తారు. ఇప్పటికే ఏపీలో అనేక రకాల సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకువచ్చారు. ఏపీ ప్రజలకు ఎన్నో రకాల మంచి పనులను చేస్తున్నారు.