Jawan- Toll Staff:యూపీ మీరట్ లో ఓ ఆర్మీ జవాన్ పై టోల్ ప్లాజా సిబ్బంది దాడికి పాల్పడ్డారు. రాజ్ పుత్ రెజిమెంట్ లో సైనికుడిగా పనిచేస్తున్న కపిల్ కవాడ్ సెలవులపై ఇంటికి వచ్చి తిరిగి నిన్న రాత్రి శ్రీనగర్ బయలుదేరాడు. ఢిల్లీ విమానాశ్రయానికి వెళ్తుండగా భూని టోల్ గేట్ వద్ద వెహికల్ చాలా ఆలస్యమయ్యాయి. టోల్ సిబ్బందితో వాగ్వాదం జరిగింది.

దీంతో అక్కడ ఉన్న ఐదుగురు ఉద్యోగులు కపిల్ ను స్తంభానికి కట్టేసి కర్రలతో చితకబాదారు. అక్కడికి చేరుకున్న పోలీసులు సైనికుడిపై దాడికి ప్రయత్నించిన వ్యక్తులను అరెస్టు చేశారు. అసలు ఆ సైనికుడిపై దాడి చేయడానికి గల కారణాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటనకు గల మరిన్ని కారణాలు తెలియజేస్తుంది.
ఉత్తరప్రదేశ్లో దారుణం
మేరఠ్ టోల్గేట్ వద్ద ఆర్మీ జవాన్పై కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసిన టోల్గేట్ సిబ్బంది
సెలవుల అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్తూ, టోల్గేట్ వద్ద ఆలస్యాన్ని జవాన్ కపిల్ ప్రశ్నించడంతో దాడి
రాజ్పుత్ రెజిమెంట్లో సైనికుడిగా పనిచేస్తున్న బాధిత ఆర్మీ జవాన్… pic.twitter.com/WEZ2Vx3q2u
— Telugu Scribe (@TeluguScribe) August 18, 2025