కూలీ, వార్-2 4 రోజుల కలెక్షన్లు..ఎన్ని కోట్లు అంటే ?

-

రజనీకాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం కూలీ. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలై నాలుగు రోజులు అవుతుంది. నాలుగు రోజులలో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లను వసూలు చేసినట్లు పలు మీడియా కథనాలు వెల్లడించాయి. ఇక ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్లో వచ్చిన తాజా చిత్రం వార్-2.

War 2, Coolie movie, war 2 tickets
War 2, Coolie movie, war 2 tickets

ఈ సినిమా విడుదలై నేటికీ నాలుగు రోజులు అవుతుంది. ఈ నాలుగు రోజులలో ఈ సినిమా కేవలం రూ. 275 కోట్లు కలెక్ట్ చేసినట్టుగా వెల్లడించారు. కాగా, ఈ రెండు సినిమాలు ఆగస్టు 14వ తేదీన విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్నాయి. ఈ రెండు సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. కానీ ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలను తగినట్టుగా ఆకట్టుకోలేకపోయింది. మరికొన్ని రోజులలో ఈ రెండు సినిమాలు ఏ మేరకు కలెక్షన్లను రాబడతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news