వినాయకుడి విగ్రహాలపై తెలియని ఆశ్చర్యకరమైన నిజాలు..

-

హిందూ సాంప్రదాయాలలో గణపతి పూజ ప్రధమంగా చేస్తారు. హిందూ ఆరాధనలో విగ్నేశ్వరుడు ప్రత్యేక స్థానం కలిగి ఉన్నాడు. వినాయక చవితికి ప్రతి వాడ, పల్లెలో ఎన్నో గణేష్ విగ్రహాలను నెలకొల్పి పూజిస్తారు. ఎంతో శోభాయమానంగా ఈ పండుగ జరుగుతుంది. ప్రతి ఇంట్లోనూ వినాయకుడి విగ్రహం పెట్టి పూజించడం ఆనవాయితీగా వస్తుంది. మరి ఆయన విగ్రహాలు ఆకర్షణీయంగా, ఆధ్యాత్మికంగా ఉండటమే కాక వాటి వెనుక ఆసక్తికరమైన విషయాలు ఎన్నో దాగి ఉన్నాయి. ప్రపంచంలోనే అరుదైన వినాయక విగ్రహాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పసుపు వినాయకుడు: శివపురాణం ప్రకారం పార్వతీ దేవి తన శరీరంలోని పసుపు, చందనంతో వినాయకుని సృష్టిస్తుంది. అందుకే ఏ పూజకైనా ముందుగానే పసుపుతో వినాయకుని రూపొందించి పూజించడం ఆనవాయితీ.

మనిషి తల పోలిన వినాయకుడు : తమిళనాడులోని కూతనూరు సమీపంలో తిలతర్పణ పురిలో వినాయకుడి విగ్రహం మానవ తల ఆకారంలో ఉంటుంది. ఇది శివుడు ఏనుగు తలను అతికించే ముందు గణేషుడి అసలు రూపం అని నమ్ముతారు.  అయిదు అడుగుల గ్రానైట్ విగ్రహం అద్భుత కళాఖండం.

ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం : థాయిలాండ్ లో 49 మీటర్ల ఎత్తైన వినాయక విగ్రహం ఉంది బౌద్ధులు కూడా ఈ విగ్రహాన్ని ఆరాధించడం ఇక్కడ విశేషం. మరో 98 అడుగుల విగ్రహం కూడా అదే ప్రాంతంలో ఉండడం మరో విశేషం.

Lesser-Known Fascinating Facts About Lord Ganesha Idols
Lesser-Known Fascinating Facts About Lord Ganesha Idols

ప్రపంచం లోనే ఎత్తిన గుడి :భారతదేశంలోని తమిళనాడులోని కోయంబత్తూరులోని పులియాకుళం పరిసరాల్లో ఉన్న వినాయక దేవాలయం. ఈ ఆలయం మొత్తం ఆసియా ఖండంలోనే అతిపెద్ద వినాయక విగ్రహాన్ని కలిగి ఉంది.

సిద్ధి వినాయకుడు : ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో విగ్రహం కుడివైపు తిరిగిన తొండం కలిగి ఉంటుంది. ఇది అరుదైన లక్షణం నాలుగు చేతులతో కమలం, గొడ్డలి, తావలం, కుడుములు ధరించిన ఈ విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది.

అష్ట వినాయక చిత్రాలు: ముంబైలోని సిద్ధి వినాయక ఆలయంలో గర్భగుడి చెక్క తలుపుపై అష్ట వినాయకుడు ఎనిమిది రూపాయలతో చిత్రాలు చక్కబడి ఉంటాయి ఇవి భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

ఈ విగ్రహాలు కేవలం శిల్ప సౌందర్యం కాదు ఆధ్యాత్మిక శక్తి, సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తాయి వినాయక చవితి సమయంలో ఈ విశేషాలను తెలుసుకోవడం మరింత భక్తి జ్ఞానం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

Read more RELATED
Recommended to you

Latest news