నందమూరి ఇంట విషాదం… సీఎం చంద్రబాబు ట్వీట్ వైరల్

-

నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ మృతి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. బావమరిది నందమూరి జయకృష్ణ సతీమణి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణించారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను అని తెలిపారు చంద్రబాబు. ఈ ఘటన మా కుటుంబంలో విషాదం నింపింది. పద్మజ ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు.

chandrababu
chandrababu

కాగా నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజా కాసేపటి క్రితమే మృతి చెందారు. తీవ్ర అనారోగ్యంతో నందమూరి పద్మజ ఈరోజు స్వర్గస్తులయ్యారు. నందమూరి తారక రామారావు పెద్ద కుమారుడు జయకృష్ణ అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరణించింది కూడా నందమూరి జయకృష్ణ సతీమణి పద్మజ. ఈమె దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయాన సోదరి కూడా అవుతుంది. అంతేకాదు హీరో నందమూరి చైతన్య కృష్ణ వాళ్ళ అమ్మనే ఈ పద్మజ. దీంతో నందమూరి కుటుంబం తీవ్ర విషాదంలోకి నెట్టి వేయబడింది. ఈ సంఘటన తెలియగానే సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ బయలుదేరారు. అటు పలువురు ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news