పిల్లలు ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వారికి కావలసినంత పోషకాహారం అందించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతారు కానీ కొంతమంది పిల్లలు సరైన విధంగా తినకపోవడంతో చాలా సన్నగా నీరసంగా కనిపిస్తారు. ఫలితంగా వారిలో ఉండే యాక్టివ్ నెస్ తగ్గిపోతుంది. మరి పిల్లల బలహీనతకు కారణాలు తెలుసుకోవడం ముఖ్యం. అంతేకాక సింపుల్ టిప్స్ తెలుసుకొని పాటిస్తే వారిలో యాక్టివ్నెస్ తిరిగి సాధించవచ్చు.
పోషకాహార లోపం : పిల్లలకు సమతుల్యమైన ఆహారం లేకపోతే బలహీనత వస్తుంది. విటమిన్ డి, ఐరన్ ప్రోటీన్ లోపం సర్వసాధారణం. అందుకే పిల్లలకు అవసరమైన పోషకాలు అందేటటువంటి ఆహారాలను అందించాలి. ముఖ్యంగా ఆకుకూరలు పండ్లు పప్పులు, పాలు రోజు ఆహారంలో చేర్చండి.
నీరసం: ఎక్కువమంది పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే నీరసంగా ఉందని చెబుతుంటారు దీనిలో మొదటి కారణం పిల్లలు తగినంత నీటిని తాగకపోవడం దీంతో డిహైడ్రేషన్ వల్ల బలహీనత వస్తుంది అందుకే పిల్లలకి రోజు 6 నుంచి 8 గ్లాసుల నీటిని తాగించాలి. నీరు తాగడానికి ఇష్టపడకపోతే కనీసం కొబ్బరి నీళ్లు లేదా ఫ్రూట్ జ్యూస్ వారికి అందించాలి.

నిద్ర లేకపోవడం: పిల్లలు ఎక్కువగా యాక్టివ్ గా లేరు అంటే వారికి తగినంత నిద్ర లేదని అర్థం. ఈ రోజుల్లో పిల్లలు ఫోన్లకి ఎడిట్ అయిపోయి నైట్ అన్నం తిన్న తర్వాత కూడా ఎక్కువసేపు ఫోన్ చూస్తూ ఉండడం వల్ల వారికి సరైన నిద్ర అందడం లేదు. లేట్ నైట్ నిద్రపోవడం, పొద్దున్నే స్కూల్ కి తొందరగా లేవడంతో వారికి నిద్ర కరువై శరీరం నిరసిస్తుంది. పిల్లలు కనీసం 8 నుంచి 10 గంటల పాటు నిద్ర అవసరం నిద్ర తక్కువైతే శరీరం, మెదడు బలహీనపడతాయి. రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ ని వారికి అర్థమయ్యే విధంగా చెప్పండి. స్క్రీన్ టైమ్ తగ్గించండి.
ఎక్సర్సైజ్ లేకపోవడం: ఈరోజుల్లో బయటికి వెళ్లి ఆడుకునే పిల్లలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎక్కువగా ఇంట్లో మొబైల్ ఫోన్స్ లేదా వీడియో గేమ్స్ ఆడుతూ, ఇంటికి పరిమితమైపోతున్నారు. వారికి తగినంత శారీరక శ్రమ లేకపోవడం వల్లే కండరాలు బలహీన పడుతున్నాయి. పిల్లలకు కనీసం రోజుకి 30 నిమిషాలు ఆటలు, సైకిల్ లేదా డాన్స్ ప్రోత్సహించాలి. వారికి ఏది ఇంట్రెస్ట్ గా ఉందో అలాంటి వ్యాయామాలను చేయించడం వలన పిల్లలు కండరాలు బలపడతాయి.
ఆందోళన: ఈ సమస్య పెద్దవాళ్లదే కాక పిల్లల్ని కూడా వేధిస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు స్కూల్లో స్నేహితులతో వచ్చే చిన్న చిన్న తగాదాలకే ఎక్కువ ఆందోళన చెందుతూ ఉంటారు. స్నేహితులతో సమస్యల వల్ల పిల్లలు మానసికంగా బలహీనపడుతున్నారు. దీనికి మొదటి కారణం వారితో పేరెంట్స్ ఓపెన్ గా మాట్లాడకపోవడం. స్కూల్ నుంచి ఇంటికి రాగానే పిల్లలకి దగ్గరికి తీసుకొని వారితో ఓపెన్ గా మాట్లాడాలి. వారికి సపోర్ట్ గా మీరున్నారని వారికి అర్థం అయ్యేలా చెప్పాలి. అప్పుడు స్కూల్లో ఎటువంటి సమస్య వచ్చినా మీతో డైరెక్ట్ గా చెప్పడానికి వాళ్ళు ధైర్యం చేస్తారు.