ఒక ప్రతిజ్ఞతో భీష్ముడి జీవితం ఎలా మారిపోయింది?

-

హిందూ ఇతిహాసాలలో అత్యంత ప్రాముఖ్యత చెందినవాటిలో మహాభారతం ఒకటి. వింటే భారతం వినాలి తింటే గారెలు తినాలి అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఒక వ్యక్తి ఇతిహాసాల ద్వారా ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న మన చరిత్రను తెలుసుకోవడానికి ఎన్నో మార్గాలు వున్నా, తెలుసుకునే ప్రయత్నం కొందరే చేస్తున్నారు. ఇక మహాభారతంలో ఎన్నో పాత్రలు, ఉన్నప్పటికీ భీష్ముడు ప్రతిభావంతమైన పాత్ర పోషించారు. ఆయన తీసుకున్న ఒకే ఒక ప్రతిజ్ఞ జీవితాన్ని, కురు వంశ చరిత్రను మార్చేసింది. మరి భీష్ముడి ప్రతిజ్ఞ దాని పరిణామాలు మహాభారతంలో ఆయన ప్రాముఖ్యతను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

భీష్ముడు ఎవరు?: భీష్ముడి అసలు పేరు దేవ వ్రతుడు(భీష్ముడు) ఇతను హస్తినాపుర రాజు సంతనుడికి, గంగాదేవికి పుత్రుడు.గంగాదేవి ద్వారా దివ్యశక్తులు పొందిన దేవ వ్రతుడు అసాధారణమైన యోధుడు. ఆయన బాల్యం నుంచే వేదాలు ఆయుధ విద్యలో నైపుణ్యం సంపాదించాడు. కానీ ఆయన జీవితంలో ఒక ప్రతిజ్ఞ ఆయన జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది.

శంతనుడు సత్యవతి అనే మత్స్య కన్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ ఆమె ఒక విచిత్రమైన కోరికను కోరింది. అప్పటికే సంతనుడికి కుమారుడిగా భీష్ముడు ఉన్నాడు. ఆయన రాజ్య పట్టాభిషేకం తొందరలో జరగనుంది. అయితే సత్యవతి తనకి పుట్టే సంతానమే సింహాసనానికి వారసులుగా ఉండాలని షరతు పెట్టింది. దానికి మొదట సంతనుడు అంగీకరించలేదు కానీ విషయం తెలుసుకున్న భీష్ముడు తన తండ్రి సంతోషం కోసం రెండు గొప్ప ప్రతిజ్ఞలు చేస్తాడు.

భీష్మ ప్రతిజ్ఞ ఒక త్యాగం : గంగా పుత్రుడు ఐన దేవ వ్రతుడు తండ్రి సంతోషం కోసం తన తల్లి గంగా మాత సమీపంలో ప్రతిజ్ఞలు చేస్తాడు. మొదటిది సింహాసనాన్ని త్యజించటం. తాను ఎప్పటికీ రాజు కాబోనని హస్తినాపురానికి ఎప్పటికీ రాజుగా ఉండనని ప్రతిజ్ఞ చేస్తాడు. రెండవ ప్రతిజ్ఞగా జీవితాంతం పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచర్యం పాటిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. ఇలాంటి భయంకరమైన ప్రతిజ్ఞ చేసినవాడు కావున అతనికి భీష్ముడు అనే పేరుని తెచ్చిపెట్టాయి. ఈ త్యాగం కురు వంశానికి,సత్యవతి సంతానానికి దారితీసింది. కానీ భీష్ముడి జీవితాన్ని ఒంటరితనం బాధ్యతలతో నింపేసింది.

Bhishma’s Life-Altering Oath in Mahabharata
Bhishma’s Life-Altering Oath in Mahabharata

కురు వంశ రక్షకుడు: భీష్ముడి బ్రహ్మచర్యం వల్ల కుటుంబ సుఖాన్ని తెజించాడు. ఆయన జీవితం ధర్మం, బాధ్యతలు చుట్టూ తిరిగింది. కురు వంశ రక్షకుడిగా హస్తినాపురాన్ని రక్షించే బాధ్యతను భీష్ముడి పై పడింది. సత్యవతి కుమారులైన చిత్రాంగదుడు, విచిత్ర వీరులు చనిపోయిన తర్వాత ఆయన కురు వంశాన్ని కాపాడాడు. భీష్ముడు ధర్మాన్ని గౌరవించినప్పటికీ తన ప్రతిజ్ఞ వలన కౌరవుల అన్యాయాన్ని సమర్థించ వలసి వచ్చింది. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో ఆయన మౌనం ఆయన ధర్మ సంకటాన్ని చూపిస్తుంది.

గంగ దేవి వరం: భీష్ముడు మహాభారత యుద్ధంలో కౌరవ సైన్యాధిపతిగా 10 రోజులు పోరాడాడు. అతని యుద్ధ నైపుణ్యం అజయమైనది ఆయన ధర్మం నీతి, రాజనీతి పై జ్ఞానం అర్జునుడు, యుధిష్టరుడు వంటి వారికి మార్గదర్శకంగా నిలిచాయి. శాంతి పర్వంలో ఆయన ఇచ్చిన ఉపదేశాలు అమరం. భీష్ముడు ప్రతిజ్ఞ మహాభారత కథను అపూర్వ మలుపులు తిప్పింది. ఆయన త్యాగం లేకపోతే పాండవులు, కౌరవుల చరిత్ర వేరే విధంగా ఉండేది. గంగాదేవి ఇచ్చిన వరం వల్ల భీష్ముడు తన మరణాన్ని తానే నిర్ణయించగలడు. ఆయన ఎప్పుడు కావాలంటే అప్పుడే మరణం ఆయనను చేరువయ్యేవిధంగా వరం పొందుతాడు. యుద్ధంలో శిఖండి ద్వారా గాయపడిన ఆయన ఉత్తరాయణం వరకు అంపశయ్యపై జీవించాడు.

ఇక భీష్ముడి ప్రతిజ్ఞ ఆయన జీవితాన్ని త్యాగం, బాధ్యత, ధర్మ సంకటాలతో నింపేసింది. ఆయన మహాభారతంలో కేవలం యోధుడు మాత్రమే కాదు ధర్మం నీతి, త్యాగాలకు ప్రతీక. ఆయన ప్రతిజ్ఞ లేకపోతే మహాభారత కథ వేరేలా నడిచేది. భీష్ముడి జీవితం మనకు గొప్ప పాఠం, ఒక నిర్ణయం జీవిత చరిత్రను  మార్చగలదు అని తెలియ చెప్పేదే భీష్మ ప్రతిజ్ఞ.

Read more RELATED
Recommended to you

Latest news