తమిళ బిగ్ స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ దాదాపు 40 సంవత్సరాల తర్వాత కలిసి ఓ సినిమాలో నటించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది. క్రేజీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తన తదుపరి ప్రాజెక్టు వీరిద్దరితోనే తీయడానికి సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో వార్త వైరల్ గా మారింది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చినట్లయితే థియేటర్లు దద్దరిల్లిపోతాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Rajinikanth's combo movie with that star hero
ఇప్పటికే కమల్ హాసన్, రజనీకాంత్ తో విక్రమ్, కూలీ సినిమాలను లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా రజనీకాంత్ తాజాగా నటించిన చిత్రం “కూలీ”. ఈ సినిమా ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం రజనీకాంత్ ఇతర సినిమా ప్రాజెక్టులతో బిజీగా ఉన్నట్లు సినీ సర్కిల్ లో ఓ వార్త వైరల్ గా మారుతుంది. రజనీకాంత్ ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి. మరోవైపు కమల్ హాసన్ కూడా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.