ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త అందజేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఏపీలో 16,347 డీఎస్సీ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు విద్యాశాఖ సన్నాహాలు చేస్తోంది. జిల్లాల వారీగా జాబితాను ప్రకటించి అభ్యర్థులను వెరిఫికేషన్ కు పిలవాలని నిర్ణయం తీసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు అధికారులతో ప్రత్యేక బృందాలను నియమించనుంది. ఈ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు. త్వరలోనే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

కాగా, సెప్టెంబర్ రెండో వారంలోగా కొత్త టీచర్లకు పోస్టింగ్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా…. ఆగస్టు 15వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పథకంతో ఉచిత బస్సు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మహిళలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. సామాన్య మానవులు, నిరుపేదలు ఎలాంటి చార్జీలు లేకుండా వారి గమ్యస్థానాలకు చేరుకుంటున్నారు. కాగా, నేటి నుంచి తిరుమలకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా తిరుమలకు చేరుకోవచ్చు.