ఏపీలో పెన్షన్లు పొందలేని దివ్యాంగులకు ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించింది. పెన్షన్ కు అనర్హులుగా నోటీసులు పొందిన దివ్యాంగులకు ప్రభుత్వం మరో అవకాశాన్ని ఇచ్చింది. తాము పెన్షన్ పొందడానికి అనర్హులమని భావించేవారు వెంటనే మరోసారి దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. సమీపంలోని ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్లకు దరఖాస్తులు ఇవ్వాలని పేర్కొన్నారు. అనర్హుల గుర్తింపులో అక్రమాలు జరిగాయని అన్నారు.

నోటీసులు అందుకున్న వారు సదరం శిబిరాల్లో మరోసారి వైకల్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కాగా, ఇప్పటికే చాలామంది దివ్యాంగులు వారి పెన్షన్ కు అనర్హులు అయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం మరోసారి దివ్యాంగులకు పెన్షన్ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వడంతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా దివ్యాంగులకు రూ. 3వేల రూపాయల పెన్షన్ ను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అందిస్తోంది.