ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందినది మేడారం జాతర. ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం జాతరను అత్యంత కన్నుల పండుగగా జరుపుకుంటారు. సమ్మక్క సారక్కను దర్శనం చేసుకునేందుకు కోట్లాది సంఖ్యలో భక్తులు మేడారంకి వెళతారు. అయితే మేడారంలో ఇప్పటివరకు పెద్దగా కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేదు అధికారులు.

మేడారం జాతరకు వెళ్ళిన భక్తులు అక్కడ చాలా రకాల ఇబ్బందులను పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం మేడారం మహా జాతర కోసం ఏకంగా రూ. 150 కోట్లు మంజూరు చేసింది. వచ్చే సంవత్సరం జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు ఈ జాతర జరగనుంది. దీంతో ఆలయ అధికారులు ప్రత్యేకమైన చర్యలను చేపట్టి అక్కడ అభివృద్ధి పనులను చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులను వినియోగించుకొని మేడారం జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయం తీసుకున్నారు.