తెలంగాణలో మద్యం దుకాణాల టెండర్లకు ప్రభుత్వం ఫీజు ఫైనల్ చేసింది. రూ. 3 లక్షల నాన్ రిఫండబుల్ డీడీ చెల్లించాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. గతంలో ఈ ఫీజు రెండు లక్షలే ఉండగా ఇప్పుడు మూడు లక్షలకు పెంచారు. నగరాలలో లైసెన్స్ ఫీజును సైతం రూ. 10 లక్షలకు పెంచారు. కానీ కాల పరిమితి మాత్రం పాత పద్ధతిలోనే రెండు సంవత్సరాలకే పరిమితం చేసింది.

మద్యం దుకాణాల టెండర్లకు సంబంధించి స్వీకరణ తేదీలు ఇంకా ఫైనల్ కాలేదు. రిజర్వేషన్లు గౌడ్స్ కి 15%, ఎస్సీలకి 10%, ఎస్టీలకు 5 శాతంగా నిర్ధారించారు. ఇది నా ఉండగా… తెలంగాణ రాష్ట్రంలో మందు బాబులు రోజురోజుకీ పెరిగిపోతున్నారు. మద్యం తాగడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని తెలిసినప్పటికీ మందు తాగకుండా ఎవరూ ఉండడం లేదు. మద్యం తాగడంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉంటుంది. వారంలో ఒకసారి మాత్రమే మద్యం తాగాలని అంతకుమించి తాగినట్లయితే ఆరోగ్యం పాడవుతుందని వైద్యనిపుణులు సూచనలు చేస్తున్నారు.