సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన టమాట ధరలు…!

-

తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో టమాటా రేట్లు భారీగా పెరిగాయి. తెలంగాణలోని హైదరాబాద్ లాంటి మహా నగరాలలో నాణ్యమైన టమాటా ధర కేజీ రూ. 60 నుంచి 70 వరకు పలుకుతోంది. హోల్ సేల్ గా కేజీ రూ. 40 నుంచి 50 వరకు ఉంది. మరోవైపు ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం లాంటి మహానగరాలలో కేజీ టమాటా ధర రూ. 50 నుంచి 60 ఉండగా… వివిధ జిల్లాల్లో రూ. 35 నుంచి 45 వరకు ధర పలుకుతుంది.

Tomato prices have dropped drastically
Tomato prices

అతి భారీ వర్షాలు, వరదల కారణంగా టమాటా పంటలు దెబ్బతిన్నాయి. దీంతో టమాటా ధరలు ఒక్కసారిగా విపరీతంగా పెరిగాయి. పంటలు పూర్తిగా నాశనం అవడంతో టమాటా మార్కెట్లలోకి రావడం లేదు. దీంతో టమాటా ధరలు భారీగా పెరిగాయి. ఇంత ఎక్కువగా టమాటా ధరలు పెరగడంతో సామాన్య మానవులు ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కరూ కూరలలో టమాటాలు లేకుండా కూరను సామాన్యంగా చేయనే చేయరు. అలాంటివారు టమాటా రేట్లు ఎక్కువగా పెరగడంతో వాటిని కొనాలంటే కాస్త ఆలోచనలో పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news