టాలీవుడ్ ఇండస్ట్రీలో పెను సంచలనం చోటుచేసుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత… చాలామందిని.. అరెస్టు చేస్తున్న ప్రభుత్వం… తాజాగా… ఇప్పుడు మరొకరిని అరెస్టు చేసింది. వ్యూహం సినిమా నిర్మాత దాసరి కిరణ్… తాజాగా అరెస్టయ్యారు. హైదరాబాద్ మహానగరంలో… వివో సినిమా నిర్మాత దాసరి కిరణ్ ను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు.

హైదరాబాద్ మహానగరంలో అరెస్టు చేసిన అనంతరం విజయవాడకు ఆయనను తరలించారు. అయితే ఆయనను ఎందుకు అరెస్టు చేశారు అనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు. వ్యూహం సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకే ఈ అరెస్టు జరిగినట్లు చెబుతున్నారు. వ్యూహం సినిమాలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా సన్నివేశాలు ఉన్నాయని.. కూటమి సర్కార్ సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే.