భద్రాచలం పెరుగుతున్న గోదావరి నీటిమట్టం.. మరికాసేపట్లోనే చివరి ప్రమాద హెచ్చరిక !

-

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. అయినప్పటికీ క్రమక్రమంగా గోదావరి… వరద పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు గోదావరి నీటిమట్టం 48 అడుగులు దాటింది. 53 అడుగులు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు.

Godavari water level rising in Bhadrachalam
Godavari water level rising in Bhadrachalam

అదే చివరి ప్రమాద హెచ్చరిక కానుంది. ఇలాంటి నేపథ్యంలో భద్రాచలం లో ఉన్న లోతట్టు ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్నారు అధికారులు. కెసిఆర్ సమయంలో కూడా ఇలాగే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అనంతరం.. భద్రాచలం పట్టణంలోకి వరద వెళ్ళింది. దీంతో చాలా ఇండ్లు మునిగిపోయాయి. ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అలర్ట్ అయి అధికారులు జనాలను సేఫ్టీ ప్లేసులకు తీసుకువెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news