ఓ ఆరోగ్య కార్యకర్త చేసిన పని అందరిని ఆకట్టుకుంది. పిల్లలకు టీకాలు వేసేందుకు సాహసం చేసింది ఆరోగ్య కార్యకర్త. ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగును దాటి హురాంగ్ గ్రామానికి చేరుకుంది కమలాదేవి. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మార్గం మూసుకుపోయింది.

ఇక ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బండరాళ్లపై దూకుతూ వాగు దాటి హురాంగ్ గ్రామానికి చేరుకుని పిల్లలకు టీకాలు వేసారు కమలాదేవి. ఈ ఘటన నేపథ్యంలో కమలాదేవి ధైర్య సాహసాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది.
కాగా గోదావరి, కృష్ణా నదుల వరద ప్రవాహం..తగ్గు ముఖం పట్టాయి. భద్రాచలం వద్ద ప్రస్తుతం 39.5 అడుగుల నీటిమట్టం ఉంది. కూనవరం వద్ద నీటిమట్టం 18.99 మీటర్లుగా ఉంది. పోలవరం వద్ద నీటిమట్టం 12.65 మీటర్లు ఉంది. ధవళేశ్వరం వద్ద ఇన్ & అవుట్ ఫ్లో 12.34 లక్షల క్యూసెక్కులుగా ఉంది.