ఏపీ బస్సులో మహిళలు కొట్టుకున్నారు . బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు డ్రైవర్. తరుణంలోనే మహిళలపై కేసు నమోదు అయింది. విజయవాడ నుండి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం కొట్టుకున్నారు మహిళలు. ఎంత చెప్పినా వినకపోవడంతో, బస్సు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు డ్రైవర్.

పబ్లిక్‌లో న్యూసెన్స్ చేసినందుకు మహిళలపై బీఎన్ఎస్ సెక్షన్ 3, 126(2), 115(2), 351(2) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. కాగా తిరుమల వెళ్లే భక్తులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తున్న ఆర్టీసీ సంస్థ ఇకపై తిరుమల కొండపై కూడా అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కీలక ప్రకటన చేశారు. అయితే ఘాట్ రోడ్డు కావడం వల్ల సీటింగ్ వరకే అనుమతి ఇస్తున్నామని వివరించారు.
ఏపీ బస్సులో కొట్టుకున్న మహిళలు
బస్సును పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన డ్రైవర్.. మహిళలపై కేసు నమోదు
విజయవాడ నుండి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు
ఎంత చెప్పినా వినకపోవడంతో, బస్సు పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లిన డ్రైవర్
పబ్లిక్‌లో న్యూసెన్స్ చేసినందుకు… pic.twitter.com/t4QNB2T6xV
— Telugu Scribe (@TeluguScribe) August 23, 2025