నేడు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్బంగా స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇవాళ సాయంత్రం పార్టీకి చెందిన పలువురు నేతలతో సమావేశం కానున్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఫోకస్ పెట్టనున్నారు.

గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నూతన కమిటీల ఎన్నికపై చర్చ చేయనున్నారు. సూపర్ సిక్స్-సూపర్ హిట్ పేరుతో విజయోత్సవ సభ నిర్వహించే యోచనలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నారు. కాగా నిన్న సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓడిపోతామని తెలిసి కూడా తెలుగు వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించడం ఎందుకు? అని నిలదీశారు. సీపీ రాధాకృష్ణన్ లాంటి గొప్ప వ్యక్తికి మద్దతు ఇవ్వడం సంతోషంగా ఉంది… ఇలాంటి సమయంలో రాజకీయాలు చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. మేము ఎన్నికలకు ముందు నుంచే ఎన్డీయేలో ఉన్నాం… మా నుంచి వేరొకరికి సపోర్ట్ ఆశించడం కరెక్ట్ కాదని చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.