Warangal: వృద్ధ మహిళపై చేయిచేసుకున్న SI

-

వృద్ధ మహిళపై చేయిచేసుకున్నాడు ఎస్ఐ. వరంగల్ ఫోర్ట్ రోడ్డులో అర్ధరాత్రి ఒక రెస్టారెంట్లోకి వచ్చి గ్యాస్ సిలిండర్ తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఎస్ఐ. రెస్టారెంట్ మూసి చాలా సేపు అయింది ఇప్పుడు ఎందుకు సిలిండర్ తీసుకెళ్తున్నారని ప్రశ్నించారు మహిళ. దీంతో అత్యుత్సాహంతో మహిళపై చేయి చేసుకుని, దుర్భాషలాడారు పోలీస్ అధికారి.

SI assaults elderly woman
SI assaults elderly woman

తల్లిని ఎందుకు కొట్టారని నిలదీసిన కొడుకుపై కూడా దాడి చేశారు ఎస్ఐ. ఇక ఈ సంఘటన సాయిల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇంకా మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బాధితులు. దీనిపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news