ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. ప్రెగ్నెంట్ ఆ తర్వాత హత్య చేసి, పెట్రోల్ పోసి!

-

ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం.. ప్రేమ నుండి చావుకు యువతి కథ మలుపు తిరిగింది. కర్ణాటక – చిత్రందుర్గకు చెందిన డిగ్రీ విద్యార్థిని వర్షిత(19)కు ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయ్యాడు చేతన్(21). నెట్ వర్కింగ్ సంస్థలో పనిచేస్తూ, కొత్తవారిని చేర్చడానికి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టాడు చేతన్. ఆ పోస్ట్ చూసి ఉద్యోగం కోసం చేతన్‌కు కాల్ చేసింది వర్షిత.. ఈ పరిచయం కాస్త ప్రేమగా మలుపు తిరిగింది.

lovers
lovers

ప్రేమ కాస్త శారీరక కలయికగా మారి గర్భం దాల్చింది వర్షిత.. పెళ్లి చేసుకోవాలని చేతన్‌కు ఫోన్ చేసింది వర్షిత పినతల్లి. పెళ్లి చేసుకోవడం ఇష్టలేకపోవడం, ఆమె వేరేవారితో సన్నిహితంగా ఉందనే అనుమానం పెంచుకున్నారు చేతన్. ఈ నెల 18న వర్షితను నమ్మించి, చిత్రదుర్గ బైపాస్ రోడ్డులో ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేసి, పెట్రోల్ పోసి తగలబెట్టారు చేతన్. వర్షం పడడంతో సగం కాలిన మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు స్థానికులు. చేతిపై ఉన్న టాటూ ఆధారంగా మృతదేహం వర్షితదిగా గుర్తించి, విచారించగా చేతన్ హత్య చేసినట్లు నిర్ధారించారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news